పల్లెల్లో ఓట్ల పండుగ

First Phase Panchayat  Elections In Andhra Pradesh
x

Representational Image

Highlights

* ఏపీ పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు * పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు * ఉ. 6.30 నుంచి సా. 3.30ల వరకు పోలింగ్

ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో పరిణామాలు బహుషా ఏపీ చరిత్రలోనే ఇంత ఉత్కంఠను రేపి ఎలక్షన్స్ మరొకలేదు.. సర్కార్ వర్సెస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఎస్ఈసీ ప్రభుత్వ అధికారులను బదిలీ చేసింది. ఎన్నికలను ఆపేందుకు సర్కార్ చివరి వరకూ పోరాటం చేసింది. న్యాయస్థానంలో ఎస్ఈసీ వైపు సానుకూల తీర్పు రావడంతో నిమ్మగడ్డ రెచ్చిపోయారు. అవకాశం దొరికిన ప్రతిసారి ప్రభుత్వంపై ఎటాక్ చేశారు చివరకు ఇవాళ తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి.

పల్లెల్లో ఓట్ల పండుగ వచ్చింది. తొలి దశ పంచాయతీల్లో గెలిచేదెవరో రాత్రికి తెలిసిపోతోంది. ఉదయం పోలింగ్ సాయంత్రం కౌంటింగ్.. ఎన్నో పరిణామాలు, మరెన్నో ట్విస్ట్‌ల మధ్య జరగబోతున్న ఓటింగ్ ఉత్కంఠ రేపుతోంది. విజయనగరం జిల్లా మినహా.. మిగతా 12 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మొదటి విడతలో భాగంగా 12 జిల్లాలలో 18 రెవెన్యూ డివిజన్‌లో 2723 పంచాయతీలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 525 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఉదయం 6గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.30 నిమిషాల వరకు ఓటింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాత్రి వరకు తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ పేషెంట్లకు చివరి గంట అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారు తప్పకుండా మాస్క్‌ ధరించాలని అధికారులు కోరారు..

మొదటి సారి ఏపీ పంచాయతీ ఎన్నికల్లో నోటాను అందుబాటు ఉంచారు. సమస్యాత్మక గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నిర్భయంగా ఓటు వేయాలని ఎస్ఈసీ, కలెక్టర్లు, ఎస్పీలు పిలుపునిచ్చారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.

ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. 18 వేల 608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, ఎనిమిది వేల 503 మధ్యరకం, 21 వేల 338 చిన్న బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. 215 కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశామని అధికారలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories