ఇవాళ్టి నుంచి ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

First Phase Election campaign in Andhra Pradesh Is Starts from Today
x

Representational Image

Highlights

* ఎస్‌ఈసీ ఈ-వాచ్‌ యాప్‌పై నేడు హైకోర్టులో విచారణ * రెండోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన * ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్‌

ఇవాళ్టి నుంచి ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ప్రారంభంకానుంది. అలాగే రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో నేటి నుంచి నామినేషన్ల పరిశీలన జరగనుంది. దీంతో ఏకగ్రీవాలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎస్‌ఈసీ రూపొందించిన ఈ-వాచ్‌ యాప్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల పర్వం ముగిసింది. మూడోరోజు అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. చివరి రోజు ప్రకాశం జిల్లాలో అత్యధికంగా వేయి 334, అత్యల్పంగా కడపలో 586 సర్పంచ్‌లకు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 6వేల 69, అత్యల్పంగా కడపలో 2వేల 54 వార్డులకు నామినేషన్లు వేశారు. మూడురోజులు కలిపి మొత్తంగా సర్పంచ్‌ స్థానాలకు 19వేల 399, వార్డు స్థానాలకు 79వేల 842 నామినేషన్లు దాఖలయ్యాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories