వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు సరే .. జనాలు సిద్ధంగా ఉన్నారా ?

వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు సరే ..  జనాలు సిద్ధంగా ఉన్నారా ?
x
Highlights

అసలు వాళ్ల మనసులో ఏముంది ? రిస్క్ ఎందుకులే అని ఆలోచిస్తున్నారా ?

13 నుంచి వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు సరే ! టీకా వేయించుకునేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారా ? అసలు వాళ్ల మనసులో ఏముంది ? రిస్క్ ఎందుకులే అని ఆలోచిస్తున్నారా ? అంతకుమించి కారణాలు ఏవైనా ఉన్నాయా ? సర్వేలో బయటపడ్డ వాస్తవాలు ఏంటి ?

కరోనాను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫైజర్, మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ఓకే చెప్పగా.. మన దగ్గర కూడా మహమ్మారితో పోరులో కేంద్రం కీలక అడుగు వేసింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనికా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా డ్రైరన్ పూర్తవగా.. త్వరలో వ్యాక్సిన్‌ పంపిణీ కూడా షురూ కానుంది. వీళ్లు తేదీ అనౌన్స్ చేశారు సరే.. టీకా వేయించుకునేందుకు జనాలు సిద్దంగా ఉన్నారా లేదా అన్న చర్చ కూడా జరుగుతోంది.

వ్యాక్సిన్‌ వేయించుకోవడంపై జనాల స్పందన ఏంటి? దీనికి సిద్ధంగా ఉన్నారా? అసలు వారి మనసుల్లో ఏముందో తెలుసుకోడానికి లోకల్‌ సర్కిల్స్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఒక సర్వే నిర్వహించింది. దీనిలో 26శాతం మంది జనాలు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే తీసుకుంటామని తెలుపగా... 69శాతం మంది మాత్రం టీకా వేయించుకోవడంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నామని తెలిపారు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత డిసైడ్ అవుతామని వారు అంటున్నారు.

భారత్‌లో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చినా... ప్రజలకు వ్యాక్సిన్‌ భద్రతపై సరైన సమాచారం లేకపోవడంతో వారు సుముఖత వ్యక్తంచ చేయడం లేదు. అంతేకాకుండా తమ చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు 26శాతం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మరో 56శాతం మంది మాత్రం ఒక 3నెలలు వేచి చూసి పరిస్థితిని బట్టి పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించాలా.. లేదా అన్నది నిర్ణయిస్తామని తెలిపారు.

అక్టోబర్‌లో లోకల్‌సర్కిల్స్‌ వ్యాక్సిన్‌పై సర్వేను నిర్వహించగా 61శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకొనేందుకు సుముఖంగా లేమని తెలిపారు. ప్రస్తుతం టీకాపై విముఖత తగ్గినా పూర్తిస్థాయిలో ప్రజలు సిద్ధంగా లేరని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories