ఏపీలో మరో అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు!

ఏపీలో మరో అగ్నిప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ లో మరో అగ్నిప్రమాదం కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న స్టోర్ రూమ్ లో మంటలు ఎగసిపడుతున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని.. అలాగే ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగిందన్న విషయాన్నీ తెలుసుకున్న దాచేపల్లి రెవెన్యూ, పోలీస్ అధికారులు హుటాహుటిన ఇరికేపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో ఒక ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది.

ఇక మంటల కారణంగా దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు రసాయనాల ద్వారా వచ్చే దుర్వాసన వ్యాపించింది. మరోవైపు ఫ్యాక్టరీలో భారీగా వెలువడుతున్న కెమికల్స్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయేమోనని ఇరికేపల్లి గ్రామస్థులు భయపడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇబ్బంది ఏమి లేదని చెప్పినట్టు సమాచారం. కాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజి ఘటన మరవకముందే ఆ తరువాత నంద్యాల, ఇప్పుడు దాచేపల్లి ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories