ప్రకాశం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..

ప్రకాశం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..
x
Highlights

ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ ఏసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన కనిగిరికి 15...

ప్రకాశం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పామూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ ఏసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన కనిగిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగారెడ్డిపల్లి గ్రామం వద్ద జరిగింది. అర్ధరాత్రి సమయంలో బస్సు టైరు పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంతో గట్టిగా కేకలు వేశాడు.. ప్రయాణికులు వెంటనే బస్సు దిగడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు.

ఆలస్యమైతే ఘోర ప్రమాదమే జరిగి ఉండేది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినా.. బస్సు పూర్తిగా దగ్ధమైంది. అప్పటి వరకు సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సు రావడంతో వారు తమ ప్రాంతాలకు బయలుదేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories