మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు

మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిలో చెలరేగిన మంటలు
x
Highlights

♦ ఊపిరి ఆడక మృతి చెందిన నవ జాత శిశువు ♦ ఆసుపత్రి యాజమాన్యంపై బంధువుల ఆగ్రహం

అనంతపురం జిల్లా హిందూపురంలో విషాదం జరిగింది. పట్టణంలోని మాతాశిశు సంరక్షణ ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. ఆసుపత్రిలోని ఐసీయూలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో ఊపిరి ఆడక నవ జాత శిశువు చనిపోయింది. ఎయిర్‌ కంప్రెషర్‌ తొలుత మంటలు చెలరేగాయని చిన్నారి బంధువులు పైప్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. పొగలు రావడంతో పక్కనే ఉన్న పసికందు మృతి చెందిందని తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తున్నారు .

అయితే పసికందు పుట్టినప్పటినుంచే అనారోగ్యంతో ఉన్నాడని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.కేశవులు తెలిపారు. చిన్నారి అనారోగ్యంతో మృతి చెందాడని డాక్టర్‌ ఆభిప్రాయ పడ్డారు. ఎయిర్‌ కంప్రెషర్‌ లో పొగ రావడంతో బయపడి పిల్లాడిని బయటికి తెచ్చారన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వహించలేదని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories