పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరు నెలల పసిపాప సజీవదహనం

Fire Accident At Palnadu District
x

పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఆరునెలల పసిపాప సజీవదహనం

Highlights

Palnadu: కాపాడేందుకు వెళ్లిన మహిళకు తీవ్రగాయాలు

Palnadu Fire Accident: పల్నాడు జిల్లా పెదపాలెం ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి వ్యాపించడంతో ఐదు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఆరునెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. గుడిసెలోని ఉయ్యాలలో ఉన్న పాప మంటల ధాటికి సజీవదహనమైంది. పాపను కాపాడేందుకు ప్రయత్నించినా అమ్మమ్మ మేరీకి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా.. వారిని సత్తెనపల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సకాలంలో స్పందించకపోవడంతోనే మంటలు భారీగా వ్యాపించాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories