మాస్క్ లేకపోతే వడ్డింపే..!

మాస్క్ లేకపోతే వడ్డింపే..!
x
Highlights

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతున్నా కొంతమంది పట్టించుకోవడం లేదు. రోడ్లు, జన సంచారం ఉన్న స్థలాల్లో మాస్క్ ల్లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. దీనిపై...

కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతున్నా కొంతమంది పట్టించుకోవడం లేదు. రోడ్లు, జన సంచారం ఉన్న స్థలాల్లో మాస్క్ ల్లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. దీనిపై పలుమార్లు ప్రభుత్వాలు, అధికారులు చెప్పినా వీరు తీరులో మార్పు రాలేదు. అయితే మాస్క్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా పట్టని వారిని వదిలేయకూడదని నిర్ణయించింది. మాస్క్ లేకుండా బయట తిరిగితే భారీగా జరిమానా వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పోలీసులు రంగ ప్రవేశం చేసి, రూ. వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు.

క‌రోనా పంజాతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణల‌లో అయితే, రోజూ వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోదు అవుతుండ‌టంతో జ‌నం టెన్ష‌న్ ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా ఉండ‌టం వ‌ల్లే ఈ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆటోల్లో కిక్కిరిసి వెళ్ల‌డం, రోడ్ల‌పై ఉమ్మివేయ‌డం, మాస్కులు లేకుండా తిర‌గ‌డం, గుంపుల్లో ఉండ‌టం వ‌ల్ల క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి సోకుతోంద‌ని,..ద‌య‌చేసి ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ప్రభుత్వ సూచనల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఏపీ స‌ర్కార్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.. ఇకపై బయటకు వచ్చినవారు ఎవరైనా మాస్కులు పెట్టుకోకపోతే జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై మాస్ పెట్టుకొకపొతే జరిమానా విధిస్తామని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడంతో ఇక ఎవరైనా మాస్క్ పెట్టుకోక పోతే భారీగానే జ‌రిమానా విధించ‌నున్నారు. గ్రామాలలో అయితే రూ.500.. పట్టణాల్లో అయితే రూ.1000 జరిమానా విధించమని చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి దగ్గరకు చేరాయి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ మాస్క్ లేకపోతే పర్సులు ఖాళీ కావడం ఖాయమ‌ని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories