ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లే అధికం..

ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఓటర్లే అధికం..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల తుది జాబితా విడుదల అయింది. మొత్తం 3,93,45,717 ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌ 11న 25 లోక్‌సభ, 175...

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల తుది జాబితా విడుదల అయింది. మొత్తం 3,93,45,717 ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్‌ 11న 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాను సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు.

గత 20 రోజుల్లో కొత్తగా 24,12,626 మంది ఓటర్లు చేరారని, అదే సమయంలో 1,41,823 ఓటర్లను తొలగించినట్లు ఆయన తెలిపారు. ఇందులో మహిళా ఓటర్లు 1,98,79,421 ఉండగా.. పురుష ఓటర్లు 1,94,62,339 ఉన్నారు. అలాగే ఇతరులు 3,957 మంది ఉన్నారు. పురుషుల కన్నా 4,17,082 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories