కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం

Final Notification Issued To Form 13 Districts Into 26 Districts
x

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం

Highlights

Andhra Pradesh: 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 4 వ తేదీ నుంచి ఏపీలో కొత్త జిల్లాలు పరిపాలనా పరంగా కొత్త యూనిట్‌ గా మార్పు చెందుతున్నట్లు పేర్కొంది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ.. గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేసింది సర్కార్‌. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుండి 73కి పెరిగింది. పాత రెవెన్యూ డివిజన్‌లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం 26 జిల్లాలకు కలెక్టర్లను, ఎస్పీలను నియమించింది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల కలెక్టర్లలో నలుగురిని తప్ప మిగతా 9 మందిని వారు పనిచేస్తున్న చోటే కొనసాగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories