తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టెన్షన్‌ టెన్షన్‌

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టెన్షన్‌ టెన్షన్‌
x
Highlights

* మాటలతో కత్తులు దూసుకుంటున్న అధికార, ప్రతిపక్ష నేతలు * ఆరోపణలు, ప్రత్యారోపణలపై నేతల సత్య ప్రమాణం * ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ నేత ఆరోపణలు * అనపర్తి, బిక్కవోలులో 144 సెక్షన్‌ విధింపు * వైసీపీ, టీడీపీ నేతల మధ‌్య పొలిటికల్‌ వార్

‌తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. వైసీపీ-టీడీపీ నేతల మధ్య పొలిటికల్‌ వార్‌ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాటలతో కత్తులు దూసుకుంటున్నారు. అవినీతి ఆరోపణలు రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. దాంతో ఇవాళ సత్య ప్రమాణం చేసేందుకు ఇద్దరు రెడీ అయ్యారు. అయితే.. పరిమిత సంఖ్యలో పోలీసులు సత్యప్రమాణాలకు అనుమతివ్వడంతో అనపర్తిలో ఉత్కంఠ నెలకొంది.

అధికార, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో అనపర్తిలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. దేవుడి ముందే ప్రమాణాలకు సై అంటే సై అంటూ ఛాలెంజ్‌లు విసురుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చేసే ఆరోపణలన్నీ అసత్యాలంటూ వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఇందుకు తాను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డికి బహిరంగ సవాల్‌ విసిరారు.

అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి.. సూర్యనారాయణ రెడ్డి సవాల్‌ను స్వీకరించారు. ఒక అడుగు ముందుకు వేసి సతీసమేతంగా తాను చెప్పేవన్నీ నిజాలేనంటూ సత్యప్రమాణం చేస్తానంటూ ప్రకటించారు. అయితే రామకృష్ణా రెడ్డి హయంలో జరిగిన అవినీతి చిట్టాను ‎‎బయటపెడతానంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి. దీంతో అనపర్తిలో సూర్యనారాయణ రెడ్డి Vs రామకృష్ణారెడ్డిగా మారింది.

ఇద్దరు నేతలు సత్యప్రమాణం చేసేందుకుగాను పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే ఒక్కొక్కరి వైపు నుంచి ఐదుగురు నేతలకే అవకాశం కల్పించారు. అటు బిక్కవోలులో 144 సెక్షన్‌ విధించారు పోలీసులు. ఇక సెక్షన్‌ 144 సెక్షన్‌ ఉన్నందున ఎవరినీ వెంట తీసుకురావద్దని ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే ఫిక్స్‌ చేసిన ముహుర్తానికే ప్రమాణం చేస్తానన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి.. తానుచేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి, ఉత్కంఠ అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు ప్రజల్లోనూ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories