తండ్రి మరణం కడసారి చూసేందుకు కళ్లు తెరవలేని స్థితిలో చిన్నారి..

తండ్రి మరణం కడసారి చూసేందుకు కళ్లు  తెరవలేని స్థితిలో చిన్నారి..
x
Highlights

విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 12మంది మృత్యువాత పడగా.. రెండు వందలమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు.

విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 12మంది మృత్యువాత పడగా.. రెండు వందలమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 47 మంది చిన్నారులు ఉన్నారు. వీరంతా విశాఖలో కేజీహెచ్‌తో పాటూ ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్నారు. కొంతమంది బాధితులు ఇప్పటికే కోలుకున్నారు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అందరూ పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో కి పెట్టింది.

ఈ ఘటనలో ఎల్జీ పాలిమర్స్‌లోనే రోజుకూలీగా పనిచేసే గోవిందరాజు ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గోవిందరాజు మరణం కుటుంబ సభ్యులకు తెలియలేదు మీడియాలో ఫోటోలు చూసి గుర్తించినవారు ఆసుపత్రికి వచ్చి అతని మృతదేహాన్ని చూసి గుండె బద్దలయ్యేలా రోదించారు. అయితే ఘటనలో గోవిందరాజు కొడుకు మణిదీప్(5) అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మణిదీప్ కు ఈ ప్రమాదంలో విషవాయువు వల్ల కళ్ళు దెబ్బతిన్నాయి. కన్నతండ్రి ని కడసారి చూసేందుకు కళ్లు తెరువలేకపోవడం కుటుంబ సభ్యులు మరింతగా కలిచివేసింది. గోవిందరాజులు మరణం మరోవైపు మణిదీప్ కళ్ళు తెరవకపోవడం కుటుంబ సభ్యులకు మరింత విషాదంలో నెట్టింది. కాగా మణిదీప్ కళ్ళకు కు చికిత్స చేసేందుకు వైద్యుని తీసుకొస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories