Nellore: కుమార్తెను మెట్టినింటికి పంపేందుకు ఏకంగా హెలికాప్టర్‌ తెప్పించిన తండ్రి

Father Books a Helicopter for a Newly Married Couple
x

Nellore: కుమార్తెను మెట్టినింటికి పంపేందుకు ఏకంగా హెలికాప్టర్‌ తెప్పించిన తండ్రి

Highlights

Nellore: నెల్లూరులో నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ కుమార్తె వివాహం

Nellore: తన కుమార్తెను మెట్టినింటికి పంపేందుకు ఓ తండ్రి ఏకంగా హెలికాప్టర్‌ తెచ్చిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నెల్లూరు అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ కుమార్తె ఉషశ్రీ వివాహం నెల్లూరులో జరిగింది. విజయవాడకు చెందిన చిన్న ప్రశాంత్‌తో తన కుమార్తె వివాహం జరిపించారు. అనంతరం నెల్లూరు నుంచి విజయవాడకు తన కూతురు, అల్లుడిని సాగనంపేందుకు హెలికాప్టర్‌ తెప్పించి తండ్రి ప్రేమను చాటుకున్నాడు ద్వారకానాథ్‌. కొత్తజంట హెలికాప్టర్‌లో ప్రయాణించడం పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యానికి గురి చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories