కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన డెంగీ జ్వరం.. చిన్నారితో సహా ఆత్మహత్య

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన డెంగీ జ్వరం.. చిన్నారితో సహా ఆత్మహత్య
x
Highlights

డెంగీ జ్వరం వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. డెంగీ కారణంగా భార్య ఈ లోకాన్ని విడిచి వెళితే ఆమె మరణాన్ని తట్టుకోలేని

డెంగీ జ్వరం వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. డెంగీ కారణంగా భార్య ఈ లోకాన్ని విడిచి వెళితే ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త కూడా చిన్నారితో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. మండపేటకు చెందిన బాదం చందనకుమార్‌కు 2015లో అదే ప్రాంతానికి చెందిన శ్రీనవ్యతో వివాహమైంది. ఫ్లెక్సీ ప్రింటింగ్‌ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు వీరికి శ్రీయోషిత అనే మూడేళ్ల కుమార్తె ఉంది. ఎంతో అన్యోన్యంగా వారి కాపురం సాగుతోంది. రోజంతా వ్యాపారం.. ఇంటికి వస్తే చిన్నారిని చూసి మురిసిపోవడం ఇలా సంతోషంగా వారి జీవితం సాగుతుండగా.. డెంగీ జ్వరం వీరి కుటుంబాన్ని అతలాకుతలం చేసింది.

ఈ క్రమంలో శ్రీనవ్యకు తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళితే ఆమెకు డెంగీ జ్వరం సోకిందని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలోనే ఈ నెల 5న శ్రీనవ్య ఆస్పత్రిలో కన్నుమూసింది. భార్య మరణంతో చందనకుమార్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఆమె కోరిక మేరకు ఆమె కళ్లను దానం చేశాడు.అప్పటినుంచి నాటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు.. భార్య లేకుండా జీవితాంతం ఉండలేనని అనుకున్నాడు.. మరో వివాహం చేసుకున్నా తన కుమార్తెకు తల్లి ప్రేమ దక్కదని భావించాడు. దాంతో 'నా భార్య వద్దకే మేమిద్దరం వెళ్లిపోతున్నాం' అంటూ లేఖ రాసి తన కుమార్తెను హత్యచేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకేనెలలో శ్రీనవ్య, చందు, శ్రీయోషితల మృతితో వారి కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories