Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. 11 మంది మృతి.. 15 మందికి తీవ్రగాయాలు

Fatal Road Accident In Rajasthan 11 Members Died 15 Members Injured
x

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. 11 మంది మృతి.. 15 మందికి తీవ్రగాయాలు

Highlights

Rajasthan: భరత్‌పూర్‌ జిల్లా హంత్రా దగ్గర బస్సు-ట్రక్కు ఢీ

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భరత్‌పూర్‌ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఓ బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జైపూర్‌-ఆగ్రా నేషనల్‌ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని భావ్‌నగర్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని మథురకు బయల్దేరిన బస్సు.. బుధవారం తెల్లవారుజామున లఖ్నాపూర్‌ చేరుకుంది. అక్కడి ఆంత్రా ఫ్లైఓవర్‌పై హాల్టింగ్‌కు ఆగింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌పై ఆగివున్న బస్సును గమనించని ట్రక్కు.. వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఇక.. ఘటనపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories