Farmers Protest in AP: అనంతపురం జిల్లాలో రైతుల ఆందోళన

Farmers Protest in AP: జోడి ధర్మాపురం టోల్‌ ప్లాజా దగ్గర రోడ్డుపై ధర్నా * భూములు తీసుకొని, నష్ట పరిహారం చెల్లించలేదని ఆరోపణ

Sandeep Eggoju
Updated on: 5 Jun 2021 2:27 PM IST
Farmers Protest in AP | Farmers Protest in Ananthapur District Andhra Pradesh
X

రైతుల ఆందోళన (ఫైల్ ఇమేజ్)

Farmers Protest in AP: అనంతపురం జిల్లా జోడి ధర్మాపురం టోల్‌ ప్లాజా దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. టోల్‌ ప్లాజా ఏర్పాటు చేసేటప్పుడు చీమలవాగుపల్లి, ధర్మాపురం, కొట్టాలపల్లికి చెందిన 16 మంది రైతులకు సంబంధించిన భూమిని నేషనల్‌ హైవే అధికారులు తీసుకొన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు నష్ట పరిహారం చెల్లించలేదు.

ఇవాళ కోరల్‌ అసోసియేట్స్‌ కంపెనీవారు టోల్‌ ప్లాజా దగ్గర ట్రయిల్‌ రన్‌ ప్రారంభించడంతో దానిని అడ్డుకునేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్ధిచెప్పారు. గత కొన్నేళ్లుగా నష్ట పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story