ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి

ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై రాళ్ల దాడి
x
Highlights

రాజధాని ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తాకింది. గుంటూరు సమీపంలోని చినకాకాని వద్ద జాతీయ...

రాజధాని ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నిరసన సెగ తాకింది. గుంటూరు సమీపంలోని చినకాకాని వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారును రైతులు అడ్డుకున్నారు. ఓ రైతుపై ఎమ్మెల్యే గన్‌మెన్‌ చేయి చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎమ్మెల్యే వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

రైతులు పిన్నెల్లి కారును చుట్టుముట్టి దాడి చేసేందుకు యత్నించడంతో ఎమ్మెల్యే కారు వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనతో రైతులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుకు నిరసనగా పలువురు వాహనాలపై రాళ్లు రువ్వారు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో భాగంగా రైతులు విభిన్న మార్గాల్లో తరలివచ్చి జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. అంతకుముందు మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చినకాకాని వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories