Top
logo

అప్పుల బాధ భరించలేక రైతు దంపతుల ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక రైతు దంపతుల ఆత్మహత్య
Highlights

చిత్తూరు జిల్లాలో అప్పులు బాధ భరించలేక ఓ రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పుంగనూరుమండలం చండ్రమాకులపల్లి...

చిత్తూరు జిల్లాలో అప్పులు బాధ భరించలేక ఓ రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పుంగనూరుమండలం చండ్రమాకులపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్లారుబైలు గ్రామంలో మునిరత్నం, ఆయన భార్య లీలావతిలు వ్యవసాయంపై ఆధార పడి జీవనం సాగిస్తున్నారు. తమ పొలంలో టమోటా సాగు చేశారు. పంట పిందే దశకు చేరుకునే లోపు బోరులో నీరు అడుగంటి పోవడంతో చేసేది లేక అప్పులు చేసి బోర్లు వేయించారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు అప్పు చేశారు. పంట నష్టంతో మునిరత్నం, లీలావతి దంపతులు ఊరు వదలి పిల్లలతో కలిసి మదనపల్లె కు వచ్చారు. అప్పల వాళ్ల వేధింపులు అధికం కావడంతో దిక్కుతోచక మునిరత్నం, లీలావతి దంపతులు శనివారం రాత్రి ఆత్మహత్యకు చేసుకున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లలు అనాథులుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరిలు మృతుల కుటుంబీకులను పరర్శించారు. మృతుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Next Story

లైవ్ టీవి


Share it