ఆత్మహత్యకు అనుమతించాలని కుటుంబం ఆందోళన

ఆత్మహత్యకు అనుమతించాలని కుటుంబం ఆందోళన
x
Highlights

తమను అన్యాయంగా వేధిస్తున్నారని.. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలంకు చెందిన ఓ కుటుంబం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు...

తమను అన్యాయంగా వేధిస్తున్నారని.. ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలంకు చెందిన ఓ కుటుంబం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగింది. నెల్లూరు జిల్లాలోని సంగం గ్రామంలో తమకు భూమి ఉందని, పక్కనే ఉన్న పొలం యజమాని తమ కోసం ఆస్తిని విక్రయించాలని ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ యజమాని వసంతయ్య తెలిపారు. అయితే తాము విక్రయించేందుకు సిద్ధంగా లేమని చెబితే అతను తమపై బెదిరింపులకు దిగుతున్నాడని.. వసంతయ్య స్థానిక పోలీసుకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఆ భూ యజమాని సంబంధం లేని వ్యక్తులచేత కేసులు పెట్టించాడని వసంతయ్య చెప్పారు. వసంతయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద బ్యానర్ తో ఆందోళనకు దిగారు. తమ కుటుంబం ఆత్మహత్యకు అనుమతివ్వాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో వారు అధికారులకు మెమోరాండం ఇచ్చారు..

Show Full Article
Print Article
Next Story
More Stories