విశాఖలో నకిలీ డాక్టర్‌ అరెస్ట్‌

Fake Doctor in Visakhapatnam
x
Fake Doctor in Visakhapatnam
Highlights

అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న కేటుగాడి ఆటకట్టించారు విశాఖ పోలీసులు. అమాయక యువతుల్ని టార్గెట్ చేసుకొని డాక్టర్‌గా చలామణి అవుతూ.. ఎంతోమందిని మోసం చేశాడో...

అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్న కేటుగాడి ఆటకట్టించారు విశాఖ పోలీసులు. అమాయక యువతుల్ని టార్గెట్ చేసుకొని డాక్టర్‌గా చలామణి అవుతూ.. ఎంతోమందిని మోసం చేశాడో కీచకుడు. ఫోటోలు, వీడియోలతో బెదిరిస్తూ డబ్బు, బంగారం వసూలు చేశాడు. చివరికి స్పందన కార్యక్రమంలో ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.. దర్యాప్తులో అతడు చెప్పిన విషయాలతో పోలీసులే షాక్ తిన్నారు.

విశాఖ కంచరపాలెంకు చెందిన కుమార్ చేసేది డ్రైవర్‌ ఉద్యోగం.. ఈజీ మనీకి అలవాటు పడిన కుమార్ కొందరు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి.. ఫేస్‌బుక్‌‌లో ఫేక్ అకౌంట్ తెరిచాడు. డాక్టర్‌నంటు యువతులతో పరిచయాలు ఏర్పరచుకుని లోబరుచుకునేవాడు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకునేవాడు. ఆ వీడియోలు చూపించి బెదిరించి.. వారి దగ్గర నుంచి డబ్బు, బంగారం లాక్కునేవాడు.

ఓ బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుమార్‌గాడి వ్యవహారం బయటపడింది. పక్కాగా స్కెచ్ వేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో దాదాపు 17 మందికిపైగా అమ్మాయిలపై అత్యాచారం చేసినట్లు కుమార్ చెప్పిన నిజాలతో పోలీసులే షాక్ తిన్నారు. ఫేస్‌బుక్ మాయలో పడి యువతులు అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories