ఇక్కడ కొబ్బరి మొక్క నాటితే కొడుకు ఖాయం

ఇక్కడ కొబ్బరి మొక్క నాటితే కొడుకు ఖాయం
x
Highlights

కొబ్బరి మొక్క నాటండి. పండంటి కొడుకును కనండి. ఇదేదో నినాదం కాదు. ఒక ఆచారం. ఒక సంప్రదాయం. దేవుడి మీద ఎవరి భక్తి వాళ్లది. ఎవరి విశ్వాసాలు వారివి. అలాంటి...

కొబ్బరి మొక్క నాటండి. పండంటి కొడుకును కనండి. ఇదేదో నినాదం కాదు. ఒక ఆచారం. ఒక సంప్రదాయం. దేవుడి మీద ఎవరి భక్తి వాళ్లది. ఎవరి విశ్వాసాలు వారివి. అలాంటి కోవలోకే వస్తుంది ఒక పురాతన శివాలయం. శివరాత్రి రోజు పరమేశ్వరుడిని దర్శించుకొని ఒక కొబ్బరి మొక్క నాటితే వచ్చే ఏడాదికి పండంటి కొడుకు పుట్టడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఆ దేవాయలం ఎక్కడ ఉంది?

మహాశివరాత్రి మహా పర్వదినం. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతుంటాయ్‌. అలా మార్మోగే దేవాలయాల్లో ఒకటి పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని చిక్కాల గ్రామం. త్రేతాయుగంలో సాక్షాత్తూ ఆంజనేయస్వామి తన చేతులు మీదుగా ప్రతిష్ఠించబడిన గుడిగా పేరొందింది ఈ చిక్కాల శివాలయం. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా కనిపించే పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.


పండు వెన్నెల్లాంటి తెల్లదనంతో భక్తులను పరవశింపచేస్తున్న ఇక్కడి లింగాకారుడు... సంతానం లేని వారికి సంతానభాగ్యం కూడా కలిగిస్తాడని చెబుతున్నారు భక్తులు. అది కూడా మహాశివరాత్రి రోజు ఒక కొబ్బరి మొక్కను తెచ్చి పరమ శివుడి ముందు పూజలో ఉంచి దాని నాటితే వచ్చే శివరాత్రి పండంటి కొడుకు పుడుతారని భక్తులు బలంగా విశ్వసిస్తారు.

శివరాత్రి నుంచి సరిగ్గా ఏడు వారాలు ఒక దీక్షగా ఈ వ్రతాన్ని ఆచరించాల్సి వస్తుందంటున్నారు ప్రధాన అర్చకులు. శివరాత్రి రోజున అభిషేకం చేయించుకొని కొబ్బరి మొక్క నాటితే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతున్నారు. సంతానం లేని వారికి, కోరిన కోర్కెలు తీర్చే బంగారంగా చిక్కాల శివయ్య చింతలు దూరం చేస్తున్నారని భక్తులు ఆనందంగా చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories