పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం:మంత్రి దుర్గేష్

పర్యాటక రంగానికి విస్తృత ప్రచారం:మంత్రి దుర్గేష్
x
Highlights

ఈవెంట్లు, ఉత్సవాలు, అడ్వర్ టైజ్ మెంట్ ల ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

అమరావతి : ఈవెంట్లు, ఉత్సవాలు, అడ్వర్ టైజ్ మెంట్ ల ద్వారా పర్యాటక రంగానికి మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. వెలగపూడి సచివాలయం రెండవ బ్లాక్ లోని పేషీలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన బుధవారం పర్యాటక ప్రమోషన్, మార్కెటింగ్, ఈవెంట్స్, పండుగలు, ప్రకటనల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి భేటీ జరిగింది. సమావేశంలో దాదాపు 25 కు పైగా అంశాలపై కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.

మెగా ఈవెంట్లు, డిస్ట్రిక్ట్ ఈవెంట్లు, జాతీయ, అంతర్జాతీయ రోడ్డు షోలు,ఫెయిర్స్, సోషల్ మీడియా, బ్రాండింగ్ పార్ట్ నర్, హోర్డింగ్స్, డిజిటల్ అడ్వర్టైజ్ మెంట్, బ్రోచర్లు, వీడియోలు, డిజిటల్ కంటెంట్ తదితర రూపాల్లో రాష్ట్ర పర్యాటక రంగానికి, రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి దుర్గేష్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన అరకు చలి ఉత్సవ్, బెలూన్ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్, విజయవాడ ఉత్సవ్, కృష్ణవేణి సంగీత నీరాజనం తదితర అంశాలను గుర్తుచేశారు. అంతర్జాతీయ పర్యాటకులకు చేరువయ్యేలా ఉత్సవాల నిర్వహణ ఉండాలని ఆదేశించారు. కలకత్తా, హైదరాబాద్ లలో రోడ్డు షోలు నిర్వహించాలని తెలిపారు. అదే విధంగా జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో స్టాళ్ల నిర్వహణ మరింత సృజనాత్మకంగా, పర్యాటకులను, ఇన్వెస్టర్లను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు.

పర్యాటకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందన్న ఆశాభావం మంత్రి వ్యక్తం చేశారు. మరిన్ని రూపాల్లో ప్రచారం చేసి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఏపీకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పర్యాటక రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. రాబోయే రోజుల్లో భారీగా ఈవెంట్లు నిర్వహిద్దామని, ఏపీ పర్యాటక రంగాన్ని ప్రపంచానికి మరింతగా పరిచయం చేద్దామన్నారు.

సమావేశంలో టూరిజం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో శ్రీనివాసులు, ఆర్థిక శాఖ అసిస్టెంట్ సెక్రటరీ నాగమణి, ఐ అండ్ పీ ఆర్ డైరెక్టర్ విశ్వనాథన్, కమ్యూనికేషన్ అధికారి పద్మారాణి తదితరులు పాల్గొన్నారు. వీరంతా ప్రచారానికి కావాల్సిన బడ్జెట్ పై చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories