టీడీపీలో చేరిన మరో కీలక నేత

టీడీపీలో చేరిన మరో కీలక నేత
x
Highlights

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటివరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ...

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటివరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు(శనివారం) తన కార్యకర్తలతో అమరావతి చేరుకున్న నరసింహారెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం తీసుకున్నారు. ఉగ్ర 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఈసారి కనిగిరి టిక్కెట్ ను ఉగ్రకే కన్ఫామ్ చేశారు చంద్రబాబు.. ఈ మేరకు టికెట్‌పై చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రావడంతోనే ఆయన టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది. ఆయన చేరికపై కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబురావు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories