వైసీపీలోకి మెగాస్టార్ చిరంజీవి బంధువు!

వైసీపీలోకి మెగాస్టార్ చిరంజీవి బంధువు!
x
Highlights

వైసీపీలోకి మెగాస్టార్ చిరంజీవి బంధువు! వైసీపీలోకి మెగాస్టార్ చిరంజీవి బంధువు!

ఇటీవలే జనసేనకు గుడ్‌బై చెప్పిన విశాఖ జిల్లాకు చెందిన చింతలపూడి వెంకట్రామయ్య త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని విశాఖ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి బంధువైన వెంకట్రామయ్య ఎన్నికల ముందే జనసేన పార్టీలో చేరారు. అయితే ఎన్నికల తరువాత నుంచి జనసేన తలపెట్టిన ఏ కార్యక్రమంలోను ఆయన పాల్గొనలేదు. ఈ క్రమంలో ఇటీవల జనసేనకు రాజీనామా చేశారు. అయితే ఆయన వైసీపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని వైసీపీకి ప్రతిపాదించారట. అయితే ఈ ప్రతిపాదనను గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే,

వైసీపీ సీనియర్ నాయకుడు తిప్పల నాగిరెడ్డి వ్యతిరేకిస్తున్నారట. ఎమ్మెల్యే అయిన తనను కాదని మరో నేతకు టిక్కెట్ హామీ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. పైగా నియోజకవర్గంలో ఇద్దరు నేతలను ప్రోత్సాహిస్తే క్యాడర్ లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నారట. దీంతో నాగిరెడ్డి కారణంగా వెంకటరామయ్య చేరిక వాయిదా పడుతోన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు సైతం వెంకటరామయ్యతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. తనకు గాజువాక సీటు తోపాటు జిల్లా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని బీజేపీ నేతలు ఆయనతో చెబుతున్నట్టు తెలుస్తోంది. కానీ వెంకటరామయ్య మాత్రం చేరితే వైసీపీలో లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట. మరి నాగిరెడ్డి మాటను కాదని వెంకటరామయ్యను వైసీపీ తీసుకుంటుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories