గణపవరంలో రేపు గాంధేయ వాది మాజీమంత్రి మూర్తి రాజు శతజయంతి ఉత్సవాలు

గణపవరంలో రేపు గాంధేయ వాది మాజీమంత్రి మూర్తి రాజు శతజయంతి ఉత్సవాలు
x
Murthy Raju Centenary event Invitation
Highlights

మహాత్ముని అడుగుజాడల్లో నడిచి, రాష్ట్ర మంత్రిగా సేవలు అందించిన మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ప్రముఖ గాంధేయవాది, మాజీమంత్రి, మూర్తిరాజుగా సుప్రసిద్ధులైన చింతలపాటి సీతారాం చంద్ర వరప్రసాదం మూర్తిరాజు శతజయంతి ఉత్సవాలు రేపు (డిసెంబర్ 16)న నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు రేపు ఉదయం గణపవరం డిగ్రీ కళాశాల వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చింతలపాటి సీతారాం చంద్ర వరప్రసాద మూర్తి రాజు శత జయంతి ఉత్సవ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ విద్యార్థినీ, విద్యార్థులతో సాంస్కృతిక కార్య్కర్మాలు నిర్వహిస్తారు. అనంతరం ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అధ్యక్షతన సభా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు, రైతు సంఘ నాయకులు మంతెన సూర్యనారాయణ రాజు, ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజులను సన్మానిస్తారు. కార్యక్రమమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories