తల్లీకొడుకు వైసీపీలోకి వెళ్లాలని.. కోట్ల మాత్రం..

కాంగ్రెస్, టీడీపీ పొత్తు లేదని వెల్లడికావడంతో కాంగ్రెస్ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కాకలు తీరిన రాజకీయ ఫ్యామిలీగా పేరొందిన కోట్ల కుటుంబం కాంగ్రెస్ ను వీడనుంది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దాంతో ఆయన్ను పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీకి చెందిన ముఖ్యనేతలు కోట్లతో చర్చలు జరుపుతున్నారు. కోట్లకు కర్నూల్ ఎంపీ ఆయన భార్యకు డోన్ అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీ వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఆయన భార్య సుజాతమ్మ, కొడుకు రాఘవేందర్ రెడ్డి మాత్రం వైసీపీలోకి వెళ్లాలని పట్టుబడుతున్నారు. దాంతో ఆయన డైలమాలో పడ్డారు. తల్లీకొడుకులు వైసీపీతో మంతనాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ మిథున్ రెడ్డి.. కోట్ల కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. కానీ ఫైనల్ గా కోట్ల కుటుంబం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లైవ్ టీవి
నాటకమైన, సినిమా అయిన ఈయన స్టైల్ వేరు
18 Feb 2019 10:19 AM GMTసినిమా కథలో మలుపులాగానే సంగీత దర్శకుడి జీవితం
18 Feb 2019 10:15 AM GMTసరిహద్దున నువ్వు లేకుంటే ఓ సైనిక!
18 Feb 2019 9:52 AM GMTపుణ్యభూమి నా దేశం నమో నమామీ!
18 Feb 2019 9:44 AM GMTదేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMT