మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన నిర్ణయం

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన నిర్ణయం
x
Highlights

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం మైదుకూరులో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈసారి...

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం మైదుకూరులో తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటోన్న డీఎల్.. అధికార టీడీపీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని కార్యకర్తలతో డీఎల్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో తాను వైసీపీలో కూడా చేరబోనని కార్యకర్తలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈసారి ఎన్నికల్లో జనసేన నుంచి లేదా ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని డీఎల్ తన మనసులోని మాటను బయటపెట్టినట్టు తెలుస్తోంది.

కాగా వైసీపీ నుంచి టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన ఆయన.. టిక్కెట్ ఇవ్వలేనని జగన్ చెప్పడంతో చివరకు టీడీపీలో చేరాలని భావించారు. ఇటీవల సీఎం చంద్రబాబును కూడా కలిశారు. అయితే టిక్కెట్ ఇవ్వను ఎమ్మెల్సీని చేస్తానని చంద్రబాబు చెప్పినట్టు ప్రచారం జరుగుతున్న వేళా ఆయన రాజకీయంగా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే వైసీపీ నేత ఆనం రామనారాయణరెడ్డిని డీఎల్ ఇటీవల కలిశారు. దాంతో ఆయన వైసీపీలో చేరుతారని అంతా భావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories