ఆ ఇద్దరి వల్లే రాజకీయాలు వదిలేశా.. మళ్లీ వాళ్లిద్దరి వల్లే రాజకీయాల్లోకి వచ్చా: మాజీ మేయర్

ఆ ఇద్దరి వల్లే రాజకీయాలు వదిలేశా.. మళ్లీ వాళ్లిద్దరి వల్లే రాజకీయాల్లోకి వచ్చా: మాజీ మేయర్
x
Highlights

మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ వైసీపీ కండువా కప్పుకున్నారు.

నెల్లూరు: మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ వైసీపీ కండువా కప్పుకున్నారు. సుదీర్ఘంగా మూడేళ్ళ పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె ఇవాళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో వైసీపీ జండా కిందకు చేరారు. ఏపీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లు భానుశ్రీకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరంభంలోనే అదుర్స్ అన్నట్లు భానుశ్రీ తొలి రాజకీయ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఆ ఇద్దరి వల్లే రాజకీయాలు వదిలేశా.. మళ్ళీ వాళ్ళ వల్లే రాజకీయాల్లోకి వచ్చా..అంటూ మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ తొలి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కండువా కప్పుకున్న ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి దూరమవడానికి, తిరిగి రాజకీయాల్లోకి రావడానికి మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే కారణం కావడం విశేషమని అన్నారు. రాజకీయాలకతీతంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న సీఎం జగన్ సారధ్యంలో పనిచేయడం తన అదృష్టమన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories