నీచాతి నీచంగా క్యారెక్టర్‌ అసాషినేషన్‌ చేస్తున్నారు : చంద్రబాబు

నీచాతి నీచంగా క్యారెక్టర్‌ అసాషినేషన్‌ చేస్తున్నారు : చంద్రబాబు
x
Highlights

నీచాతి నీచంగా క్యారెక్టర్‌ అసాషినేషన్‌ చేస్తున్నారు : చంద్రబాబు నీచాతి నీచంగా క్యారెక్టర్‌ అసాషినేషన్‌ చేస్తున్నారు : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అణచి వేసే ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. టీడీపీ నేతలు వరుస అరెస్టుల నేపథ్యంలో ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. టీడీపీని ఎంత అణగదొక్కితే అంత రెచ్చిపోతామన్న చంద్రబాబు 40 ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూడలేదని ఆరోపించారు. చట్టం అందరికి చట్టంగా ఉంటుందా? లేక ఒక వైసీపీకి మాత్రమే చుట్టంగా ఉంటుందా అని ప్రశ్నించారు. ఎవరిని వదిలిపెట్టేది లేదని.. ప్రతి ఒక్క కేసు రివ్యూ చేస్తామని హెచ్చరించారు.

టీడీపీపై నీచంగా పోస్టులు పెడితే చర్యలు తీసుకోరని.. కానీ టీడీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని అన్నారు. వరదలపై ప్రశ్నిస్తే రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపిస్తారా అంటూ విమర్శించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యకు కారణం వైసీపీ ప్రభుత్వ వేధింపులే అన్న చంద్రబాబు.. 43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన మీరు 1 లక్ష రూపాయల ఫర్నిచర్ విషయంలో కేసులు పెట్టి కోడెలను వేధించలేదా అని సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ కార్యకర్తలను నీచాతి నీచంగా క్యారెక్టర్‌ అసాషినేషన్‌ చేస్తున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారం చేయాలంటే ఇది పులివెందుల కాదు అని హెచ్చరించిన చంద్రబాబు... ప్రజలు చీ కొట్టే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories