
వైసీపీ ప్రభుత్వం ఆరునెలల పరిపాలనపై ప్రతిపక్షనేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అందులో..6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం.
వైసీపీ ప్రభుత్వం ఆరునెలల పరిపాలనపై ప్రతిపక్షనేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అందులో..6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? అని ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి నన్నే ఆరోపిస్తున్నారు. పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి.
అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా? అని ప్రశ్నించారు. ఇక కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నామని అన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టిందని ఆరోపించారు. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం కాబట్టే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నాం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని అనుకున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వం తొలిరోజు నుంచే విధ్వంసకర పాలన మొదలుపెట్టింది. ప్రజలకు నష్టం, కష్టం కలుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా చూస్తూ కూర్చోలేం కాబట్టే బాధితుల పక్షాన అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేస్తున్నాం#6MonthsFailedCMJagan
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2019
వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇచ్చానని తిరిగి నన్నే ఆరోపిస్తున్నారు. పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి. అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా?(2/2) #6MonthsFailedCMJagan
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2019
6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందంటే అది అప్పుల్లో రికార్డు సృష్టించడం. 6 నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పనీ చేయలేదు. ఒక్క ఆగష్టులోనే 5 సార్లు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది?(1/2)#6MonthsFailedCMJagan pic.twitter.com/bQGZLUKVrh
— N Chandrababu Naidu (@ncbn) November 30, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



