Capital: విశాఖ రాజధానికి సర్వం సిద్ధం

Everything Is Ready For Visakha Capital
x

Capital: విశాఖ రాజధానికి సర్వం సిద్ధం

Highlights

Capital: సీఎం సహాయపడే అధికారులకు కూడా విశాఖలోనే ఏర్పాట్లు

Capital: సీఎం జగన్ దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగించే దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో సీఎం క్యాంపు ఆఫీసు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుపై ఏపీ సర్కార్ త్రిసభ్య కమిటీని నియమించింది. విశాఖలో సీఎం అడిషనల్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటు పరిశీలన చెయ్యాలని కమిటీని ఆదేశించింది. మున్సిపల్, ఆర్థిక, GAD ప్రిన్సిపాల్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటనలు, క్షేత్రస్థాయిలో టూర్ ల కోసం అవసరమైన ఆఫీస్ల ఏర్పాటుపై పరిశీలన చెయ్యాలని సూచిస్తూ ప్రభుత్వం ఉన్నతాధికారులకు సూచించింది.

ఇక అధికారికంగా సీఎంతో పాటు అధికారులు, మంత్రులు, ఇతర విభాగాల సిబ్బంది విశాఖ తరలిరావాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విశాఖలో రాత్రిపూట బస చేసేందుకు తగిన వసతిని గుర్తించేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. రాజధాని అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడంతో విశాఖ అధికారులు వసతుల ఏర్పాటు ప్రక్రియలో వేగం పెంచారు.

విజయదశమి నుంచే విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన నుంచి స్టార్ట్ చేయనున్నారు. అయితే రాజధాని తరలింపు అనే పేరు ఎక్కడా కూడా లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో అధికార యంత్రాంగాన్ని తరలించేలా జీవో జారీ చేసింది.

ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనం, వామపక్ష తీవ్రవాదం, గిరిజనులు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. అందుకోసమే.. HODలు, ప్రత్యేక అధికారులు తరచూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు జారీచేసింది ఏపీ సర్కార్.

అయితే సీఎం కూడా ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ను పర్యవేక్షించేందుకు విశాఖ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటు సీఎంకు సహాయపడేందుకు మిగతా అధికారులు కూడా విశాఖలోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, సీనియర్ అధికారులు అక్కడ బస చేసే వీలుగా వసతి ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories