లాక్‌డౌన్‌తో స్తంభించిన లక్కబొమ్మల పరిశ్రమ

లాక్‌డౌన్‌తో స్తంభించిన లక్కబొమ్మల పరిశ్రమ
x
Highlights

ముచ్చటగొలిపే రంగురంగుల బొమ్మలు, అందమైన కళాకృత్యాలు. ఏటికొప్పాక కళాకారుల వృత్తి నైపుణ్యానికి లోకమంతా ఫీదా అయింది. కానీ కరోనా కాటుకు ఒక్కసారిగా బొమ్మల...

ముచ్చటగొలిపే రంగురంగుల బొమ్మలు, అందమైన కళాకృత్యాలు. ఏటికొప్పాక కళాకారుల వృత్తి నైపుణ్యానికి లోకమంతా ఫీదా అయింది. కానీ కరోనా కాటుకు ఒక్కసారిగా బొమ్మల తయారీ నిలిచిపోయింది. ఉపాధి కోల్పోయి కళాకారులు జీవితాలు వెలవెలబోతున్నాయి.

విశాఖపట్నం జిల్లా ఏటికొప్పాక గ్రామం హస్త కళలకు ప్రసిద్ధి. వందలాది ఏళ్ల నుంచి ఇక్కడి కళాకారులు బొమ్మలు తయారుచేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోవడంతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఏటికొప్పాక గ్రామానికి ప్రపంచచిత్ర పటంలో స్థానం లభించింది. ఈ కళపై రెండు వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు. బొమ్మల తయారీ ద్వారా ఒక్కో కళాకారుడు రోజూ 200 రూపాయలు నుంచి 300 రూపాయలు వరకు సంపాదించేవారు.

బొమ్మలను కొన్ని స్థానిక దుకాణాల్లో విక్రయించే కళాకారులు అధిక శాతం ఎగుమతులు చేస్తారు. మన రాష్ట్రంతో పాటు పలు దేశాల్లో జరిగే వ్యాపార లావాదేవీలు ప్రతీ నెలా లక్షల రూపాయలు ఉండేంది. లాక్‌డౌన్‌ కారణంగా బయటకు వెళ్లి ముడిసరుకు తెచ్చుకునే పరిస్థితులు లేకపోవడంతో బొమ్మల తయారీ ఆగిపోయింది.

రోజూ రంగురంగుల బొమ్మల తయారీతో కళకళలాడుతూ కనిపించే కళాకారుల కాలనీ ఇప్పుడు బోసిపోయింది. బొమ్మల తయారీ సందడి లేదు. మోటార్ల చప్పుడు లేదు. ఉపాధి కోల్పోయి కళాకారుల కుటుంబాలు విలవిలలాడుతున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు ఒక్కో కళాకారుడి కుటుంబానికి నెలకు పది వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. నిత్యం రంగురంగుల బొమ్మల తయారీలో నిమగ్నమై ఉండే ఏటికొప్పాక కళాకారుల జీవితం లాక్ డౌన్ దెబ్బతో కళవిహీనంగా మారడం విచారకరం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories