అందుకే వైఎస్‌ విజయమ్మ ట్రస్టు ఏర్పాటు చేశాం : వీరభద్రావతి

అందుకే వైఎస్‌ విజయమ్మ ట్రస్టు ఏర్పాటు చేశాం : వీరభద్రావతి
x
Highlights

విదేశీ నిధుల నియంత్రణ చట్టం -2010 లోని సెక్షన్ 14 కింద చారిటబుల్ ట్రస్టులు కొన్నింటిని కేంద్ర హోమ్ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అందులో...

విదేశీ నిధుల నియంత్రణ చట్టం -2010 లోని సెక్షన్ 14 కింద చారిటబుల్ ట్రస్టులు కొన్నింటిని కేంద్ర హోమ్ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అందులో పచ్చిమగోదారి జిల్లాలో ఏర్పాటైన వైఎస్‌ విజయమ్మ చారిటబుల్‌ ట్రస్టు కూడా రద్దయింది. తణుకు పట్టణానికి చెందిన అంబడిపూడి వీరభద్రావతి దీనికి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్టు ఆధారంగా కుట్టుమిషన్‌ నేర్పించడంతోపాటు ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ, దుస్తులు తదితరాలు పంపిణీ చేసినట్టు ఆమె చెప్పారు. అయితే ట్రస్టు రద్దు కావడానికి గల కారణాలను ఆమె వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది 2018 జనవరిలో ట్రస్టు కార్యకలాపాలను నిలిపేశానన్నారు.

ఈ కారణంతోనే యాక్టీవ్ గా లేని ట్రస్టులను నిలిపివేసిందని.. ఇందులో విదేశీ డబ్బుతో నడిచే ట్రస్టులు కూడా ఉన్నాయన్నారు. కాగా 2012లో విజయమ్మ పేరుతో ట్రస్టు ప్రారంభించినప్పటి నుంచి తాను ట్రస్టీగా వ్యవహరిస్తున్నానని.. వైఎస్సార్‌ సేవా స్పూర్తితో.. ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతోనే ఈ ట్రస్టు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2018 జనవరిలోనే ట్రస్టు మూసివేస్తున్నట్లు లిఖితపూర్వకంగా సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు. ఈ ట్రస్టుతో వైఎస్సార్‌ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వీరభద్రావతి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories