రాజకీయ ఒత్తిళ్ళతో ఉద్యోగం చేస్తున్నానంటూ పంచాయితీ ఈఓ ఆవేదన

రాజకీయ ఒత్తిళ్ళతో ఉద్యోగం చేస్తున్నానంటూ పంచాయితీ ఈఓ ఆవేదన
x
Highlights

రాజకీయ ఒత్తిళ్ళతో సతమవుతూ ఉద్యోగం చేస్తున్నానంటూ పంచాయితీ ఈ ఓ శ్రీనివాసరావు ఆవేదన చెందుతున్నారు.

పాయకరావుపేట : రాజకీయ ఒత్తిళ్ళతో సతమవుతూ ఉద్యోగం చేస్తున్నానంటూ పంచాయితీ ఈ ఓ శ్రీనివాసరావు ఆవేదన చెందుతున్నారు. పట్టణంలో నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న నిర్మాణాలపై ఆయన స్పందిస్తూ ఇక్కడ ఉన్నన్ని రాజకీయ ఒత్తిళ్ళు మరెక్కడా చూడలేదన్నారు. తాను ఎస్ కోట, కొత్తవలస, చీపురుపల్లి, నెల్లిమర్ల తదితర ప్రాంతాలలో ఉద్యోగ విధులు నిర్వహించాను గానీ, అందుకు భిన్నంగా ఇక్కడ పరిస్థితి ఉందన్నారు. తాను ఇక్కడ విధులలో చేరి కేవలం ఆరు నెలలే అయినప్పటికీ, గతంలో విధులు నిర్వహించిన అధికారుల కారణంగా ఇప్పుడు తనపై ఆరోపణలు వస్తున్నాయని వాపోయారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని స్థలాల లే-అవుట్లను గుర్తించడం, వాటిపై చర్యలకు నోటీసులు తయారుచేయడం తలకు మించిన పనిగా ఉందని పేర్కొన్నారు.

వాటి యజమానులు వేరే ప్రాంతాలలో ఉండడం వలన నోటీసులు జారీ చేయడానికి జాప్యం జరుగుతున్నదన్నారు. అయితే గుర్తించిన వాటిని వి ఎం ఆర్ డి ఏ (ఉడా) కి నివేదిస్తానని అన్నారు. అందుకు ఉడా సహకరిస్తే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి అస్కారం ఉంటుందని తెలిపారు. అయితే జిల్లా స్థాయి అధికారులకు ఇతనిపై ఫిర్యాదులు వెళ్ళడంతో, మెమో అందుకున్న ఈ ఓ, ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్ళకు లొంగకుండా రూల్స్ ప్రకారం ముందుకెళతారేమో చూడాలి. కాగా పాయకరావుపేట లో నిబందనలు పాటించకుండా అక్రమంగా నిర్మితమైన భవనాలన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని సి.పి.ఎం మండల కార్యదర్శి వెలుగుల అర్జునరావు డిమాండ్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories