జగన్ సర్కార్‌కు ఊరట..96.17శాతం మంది ఒకే

జగన్ సర్కార్‌కు ఊరట..96.17శాతం మంది ఒకే
x
YS Jaganmohan Reddy(File photo)
Highlights

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాటశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాటశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జీవోలు ప్రభుత్వం తీసుకురాగా హైకోర్టు కొట్టివేసింది. ఏ మీడియంలో చదువుకోవాలనే ఆప్షన్‌పై తల్లిదండ్రులు, విద్యార్థులే నిర్ణయించుకుంటారని తెలిపింది. దీంతో ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కాగా ప్రభుత్వ పాటశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరించారు.

ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తమ అంగీకారాన్ని అందజేశారు. ఇంగ్లీషు మీడియంలో బోధనకు ఓకే చెప్పారు.ఈ మేరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించని ప్రభుత్వం చెబుతోంది.

2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను కోరింది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోధన, ఇతర భాషల్లో బోధన అంటూ.. మూడు ఆప్షన్లుగా ఇచ్చారు.96.17శాతం మంది ఇంగ్లీష్ మీడియంకు ఓకే చెప్పారు. 3.05 శాతం మంది తెలుగు మీడియం చెప్పగా.. 0.78 మాత్రమే ఇతర అప్షన్ ఎంచుకున్నారు. విద్యార్థులు 17,87,035 మంది విద్యార్థులు ఉండగా..17,85,669 మంది తల్లిదండ్రులు తమ అంగీకరాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి పంపించారు. ఇంగ్లీష్ మీడియంకు బోధనకు ఎక్కువమంది అంగీకరించడంతో ప్రభుత్వం హైకోర్టుకు నివేదించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories