టీటీడీ పాలకమండలిలో గందరగోళం.. ఒకరికి బదులు ఇంకొకరికి..

టీటీడీ పాలకమండలిలో గందరగోళం.. ఒకరికి బదులు ఇంకొకరికి..
x
Highlights

టీటీడీ పాలకమండలిలో గందరగోళం.. ఒకరికి బదులు ఇంకొకరికి..

ఇటీవల ఏర్పడిన టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకారంలో గందరగోళం నెలకొంది. టీటీడీ అధికారుల తప్పిదంతో పాలకమండలిలో ఒకరికి బదులు మరొకరిని సమాచారం అందించారు. దేవాదాయ శాఖ.. ముంబైకి చెందిన రాజేష్‌ శర్మని టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించగా... అయితే టీటీడీ అధికారులు మాత్రం ఢిల్లీకి చెందిన రాజేష్‌ శర్మకు సమాచారం ఇచ్చారు.. అంతేకాదు ఢిల్లీకి చెందిన రాజేష్‌ శర్మ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కూడా చేశారు అధికారులు.. ఆయనకు ప్రమాణపత్రాన్ని కూడా పంపించారు. అయితే, ముంబైకి చెందిన రాజేష్‌ శర్మ.. టీటీడీని సంప్రదించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో ఢిల్లీకి చెందిన రాజేష్ ను తప్పించి అక్టోబర్ 5వ తేదీన ముంబైకి చెందిన రాజేష్ శర్మతో ప్రమాణస్వీకారం చేయించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories