Yelamanchili: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం

Yelamanchili: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం
x
Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న తపనతో మంచి మార్కులు సాధించిన వారికి ప్రతి ఏటా నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని వైస్‌ ప్రెసిడెంట్‌ వి.హెచ్‌.చౌదరి అన్నారు.

యలమంచిలి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలన్న తపనతో మంచి మార్కులు సాధించిన వారికి ప్రతి ఏటా నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని ములకలాపల్లి మహా సిమెంట్‌ కర్మాగారం వైస్‌ ప్రెసిడెంట్‌ వి.హెచ్‌.చౌదరి అన్నారు. ఎలమంచిలి మున్సిపాలిటీతో సహా పది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఒక్కో బడి నుంచి ముగ్గురు విద్యార్థులను నగదు సాయానికి అర్హులుగా ఎంపిక చేశారు. ఎలమంచిలి స్టేషన్‌ రోడ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ చెక్కులు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 8, 9 తరగతుల్లో వచ్చిన మార్కులను సరాసరి చేసి పదో తరగతి పూర్తి చేశాక వీటిని అందిస్తున్నామన్నారు. మొదటి బహుమతిగా రూ.8 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు, తృతీయ బహుమతిగా రూ.4 వేలు, ఒక ప్రశంసాపత్రం ఇస్తున్నామని చెప్పారు. తానూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని జీవితంలో పైకెదిగిన విషయం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి మూర్తి, పీఆర్‌టీయూ రాష్ట్ర నాయకులు కొణతాల విశ్వేశ్వరరావు బోదెపు సాయిబాబా, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories