విశాఖ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు..

విశాఖ ఏజెన్సీలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు..
x
Highlights

-విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్‌ -జీకే వీధి మండలం మాడిగమల్లులో ఎదురుకాల్పులు -పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు - కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి -మాడిగమల్లు అటవీప్రాంతంలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

విశాఖ మన్యంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. కాల్పుల మోతతో దద్దరిల్లింది. మన్యంలో పైచేయి కోసం తరచూ హింసాత్మక చర్యలకు తెగబడుతూనే ఉన్నారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో అలజడి రేగింది. జీకే వీధి మండలం మాడిగమల్లులో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు సమాచారం. భారీ ఎన్‌కౌంటర్‌తో మావో ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇటు కాల్పుల మోతతో మన్యంవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు సైతం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories