CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన ఈఎన్‌సీ చీఫ్‌ రాజేష్ పెంధార్కర్

ENC Chief Rajesh Pendharkar Met CM Jagan
x

CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన ఈఎన్‌సీ చీఫ్‌ రాజేష్ పెంధార్కర్

Highlights

CM Jagan: ఆయనకు వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేసిన సీఎం

CM Jagan: తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవల ఈఎన్‌సీ ఛీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్‌ పెంధార్కర్‌‌ను సన్మానించిన సీఎం జగన్ ఆయనకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందజేశారు. తూర్పు సముద్ర తీరంలో సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత నావికా దళం చేపట్టిన వివిధ కార్యక్రమాలను రాజేష్‌ పెంధార్కర్‌ సీఎం జగన్‌కు వివరించారు. తూర్పు నౌకాదళ కమాండ్‌ ఆధ్వర్యంలో వచ్చే ఫిబ్రవరిలో జరిగే బహుపాక్షిక నావికా విన్యాసమైన మిలన్‌ 2024కు విశాఖపట్నం నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మిలన్‌ 2024 విశేషాలను రాజేష్ పెంధార్కర్ సీఎంతో పంచుకున్నారు. వైస్‌ అడ్మిరల్, అడ్మినిస్ట్రేషన్‌ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories