సమస్యలపై ఉద్యోగుల నిరసన - నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు

సమస్యలపై ఉద్యోగుల నిరసన - నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
x
AP Employees
Highlights

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఉద్యోగ సంఘాల జేఏసి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

నెల్లూరు: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఉద్యోగ సంఘాల జేఏసి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలు తెలియజేశారు. ఇందులో భాగంగా నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో, ఏపి ఎన్జీఓ అసోసియేషన్ నెల్లూరు నగర కార్యనిర్వాహక కార్యదర్శి విడవలూరు శ్రీకాంత్ నేతృత్వంలో, ఉద్యోగులు నిరసనను చేపట్టారు.

నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు, మధ్యాహ్నం కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విడవలూరు శ్రీకాంత్ మాట్లాడుతూ తక్షణం 11వ పిఆర్సీని అమలు చేయాలని, 3 డిఏలు విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఆరోగ్య భీమాను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం విడతల వారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలియజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories