Andhra Pradesh: ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ

ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ
Andhra Pradesh: పీఆర్సీకి వ్యతిరేకంగ ఉద్యోగులు ఆందోళనలు ఉద్ధృతం
Andhra Pradesh: ఏపీలో పీఆర్సీ మంటలు రేపుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నేడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కలెక్టరేట్‌ల ముట్టడిని పోలీసులు అడ్డుకుంటున్నారు. పలు జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతల ముందస్తు అరెస్టులు జోరుగా జరుగుతున్నాయి .
శ్రీకాకుళంNGO జిల్లా అధ్యక్షుడు సాయిరాంను పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయనతోపాటు మరి కొంతమంది నాయకులను కూడా అరెస్ట్ చేసి 2టౌన్ పీఎస్‌కు తరలించారు. అటు నెల్లూరులో కలెక్టరేట్ నిర్బంధానికి బయలుదేరిన ఫ్యాప్టో నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల నిఘా కళ్ళు కప్పి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు ప్యాప్టో నిరసనకారులు. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. రేపు సీఎస్‌కు సమ్మె నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. నేడు ఉద్యోగసంఘాల నేతలు భేటీ అయి ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇప్పటికే నిరసనలు హోరెత్తిస్తున్న ఉపాధ్యాయులు ఫ్యాఫ్టో పిలుపు మేరకు నేడు కలెక్టరేట్లు ముట్టడించగా జాక్టో డివిజన్ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. సచివాలయ ఉగ్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన చేయనున్నారు.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT