Eluru: ఏలూరు నగరపాలక సంస్థ ఎలక్షన్‌ కౌంటింగ్‌ ప్రారంభం

Eluru Municipal Election Counting Started
x
ప్రారంభం ఆయిన ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)
Highlights

Eluru: ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్‌ ఏర్పాటు * 250 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు

Eluru: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎలక్షన్‌ కౌంటింగ్‌ ప్రారంభమైంది. సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీలో నాలుగు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో టేబుల్‌ కేటాయించారు. ఓట్ల లెక్కింపు కోసం 250 మంది సిబ్బందిని నియమించారు. ఏలూరులో 50 డివిజన్లు ఉండగా.. 3 డివిజన్లు ఏకగ్రీమయ్యాయి. మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఎస్‌ఈసీ నీలం సాహ్నీ ఆదేశాలు జారీ చేశారు.కౌంటింగ్‌ ప్రక్రియను డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి, పురపాలక అధికారి పర్యవేక్షిస్తున్నారు. మార్చి 10న ఏలూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగాయి. హైకోర్టు ఆదేశాలతో కౌంటింగ్‌ను గతంలో వాయిదా వేశారు. కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఓట్ల కౌంటింగ్‌ను ప్రారంభించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories