ఏలూరు జిల్లాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య

Eluru Indian Air Force Employee Committed Suicide
x

ఏలూరు జిల్లాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఆత్మహత్య

Highlights

* పంగిడిగూడెం చెందిన హరీష్ బాబు ఉరి వేసుకుని ఆత్మహత్య

Eluru: తన పెళ్లికి ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉందనగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోంది. పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాలుగో కుమారుడు హరీష్ బాబు ఢిల్లీలోని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి ఇటీవల పెళ్లి కుదిరింది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్‌బాబు అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు తట్టగా హరీష్ బాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు S.I. టి.సుధీర్‌ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories