ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గజరాజుల భీభత్సం.. వేలాదిరూపాయల పంట, ఆస్తి నష్టం

Elephants Hulchul In Srikakulam District
x

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గజరాజుల భీభత్సం.. వేలాదిరూపాయల పంట, ఆస్తి నష్టం

Highlights

Srikakulam: వ్యవసాయ యంత్రాలను తొండంతో నాశనం చేసిన గజరాజులు

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం శాసనపల్లి గ్రామంలో రాత్రి గజరాజులు భీభత్సం సృష్టించాయి . దీంతో రైతులకు పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. గ్రామాల్లో ఉన్న వ్యవసాయ యంత్రాలను వాటి తొండంతో తిరగవేసి నాశనం చేశాయి. దీనివల్ల రైతులకు వేలాది రూపాయలు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. గ్రామంలో ఇంటి కిటికీలను తలుపులను గుద్ది కొన్ని ఇళ్ల కిటికీలను పగలగొట్టి లోపల ఉన్న ధాన్యం బస్తాలను నాశనం చేశాయి. రాత్రంతా గ్రామంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గ్రామంలో రాత్రుళ్ళు కరెంటు లేక ఏ క్షణాన ఏనుగులు ఊరు మీద పడి ఏమి చేస్తాయోనని.. గ్రామస్తులు భయభ్రాంతులకు గురైతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories