logo
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Elephants Hulchul In Parvathipuram Manyam District
X

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం 

Highlights

కల్లికోట గ్రామంలో అర్థరాత్రి గజరాజుల బీభత్సం.. బైకుతో పాటు కిరణాషాలపై ఏనుగులు దాడి

Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏగునులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో అర్ధరాత్రి ఏనుగుల గుంపు నానా బీభత్సం సృష్టించింది. ఓ బైకుతో పాటు కిరాణా షాపును ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో మన్యం వాసులు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎటునుంచి ఏనుగుల గుంపు వచ్చి దాడి చేస్తుందో అని వణికిపోతున్నారు. అటు పంట పొలాలను సైతం ఏనుగులు ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 5 ఏళ్ళుగా ఏనుగులు గ్రామాలపై దండ యాత్ర చేస్తున్నా..ఫారెస్ట్ అధికారులు మాత్రం స్పందించడంలేదని చెప్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగుల దాడుల నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

Web TitleElephants Hulchul In Parvathipuram Manyam District
Next Story