చిత్తూరు జిల్లాలో ఏనుగుల భీభత్సం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల భీభత్సం
x
Highlights

పకృతి వరమిచ్చిందో లేక జంతువులే జనావాసాలపై పడుతున్నాయో తెలియదు కాని, ఇటీవల కాలంలో అడవి జంతువులు గ్రామాలపై విరుచుకు పడుతున్నాయి. నెల రోజుల నుంచి ఈ...

పకృతి వరమిచ్చిందో లేక జంతువులే జనావాసాలపై పడుతున్నాయో తెలియదు కాని, ఇటీవల కాలంలో అడవి జంతువులు గ్రామాలపై విరుచుకు పడుతున్నాయి. నెల రోజుల నుంచి ఈ వ్యవహారం ఎక్కువగా సాగుతోంది. అయితే వీటిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్న ఒక పట్టాన లొంగడం లేదు.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. కుప్పం మండలంలోని మెట్ల చేను వద్ద పంట పొలలను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో స్థానిక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మామిడి, టమోటా, అరటితోపాటు చామంతి పూల తోటలను గజరాజులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా పొలాల్లోని డ్రిప్పు పరికరాలను కూడా తొక్కటంతో అవి పనికి రాకుండా పోయాయి.

అనంతరం మోట్లచేను నుంచి పైపాల్యం, వెండిగాంపల్లి, పల్లార్లపల్లి, గంగాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లిన ఏనుగుల గుంపు అక్కడే తిష్ట వేశాయి. ఏ సమయంలోనైనా గ్రామాలపై మరోసారి విరుచుకుపడే అవకాశం ఉందని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. అటివీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. సంఘటన స్థలంకు చేరుకున్న అధికారులు వాటిని అడవిలోకి తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ మదగజాలు మన రాష్ట్రానికి చెందినవి కావని అన్నారు. ఇవి తమిళనాడు ఫారెస్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories