టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
x
Highlights

మంగళవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్‌...

మంగళవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వి.టి.జనార్దన్‌ థాట్రాజ్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. థాట్రాజ్‌ ఎస్టీ (కొండదొర) కాదని, 2012లో హైకోర్టు, 2016లో సుప్రీంకోర్టు తీర్పులిచ్చాయని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం తెలిపారు.

దీంతో థాట్రాజ్‌ వాదన కూడా విన్న అధికారులు ధ్రువపత్రాలు పరిశీలించిన అనంతరం జనార్దన్‌ థాట్రాజ్‌ ఎస్టీ కాదని ఇదివరకే కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. దీంతో టీడీపీ తరఫున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన థాట్రాజ్‌ తల్లి నరిసింహ ప్రియ పోటీలో ఉంటారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories