ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్ పై నేడు నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్ పై నేడు నిర్ణయం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం...

ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోసున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకతపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రీపోలింగ్ పై ఎన్నికల సంఘం పరిశీలకులు పరిశీలించిన అనంతరం నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది.

సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సం ఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఉమేష్‌ సిన్హా గురువారం రాత్రి మీడియాకు వెల్లడించారు. ఏపీలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, అలాగే ఘర్షణలు కూడా హద్దులు దాటాయని హింసాత్మక సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారని ఆయన తెలిపారు. 0.98 శాతం బ్యాలెట్‌ యూనిట్లను, 1.04 శాతం కంట్రోల్‌ యూనిట్లను, 1.6 శాతం వీవీ ప్యాట్లను రీప్లేస్‌ చేసినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories