కరోనా పై టిక్‌టాక్‌లో వీడియో : ఎనమిది మంది ఆరోగ్యం విషమం

కరోనా పై టిక్‌టాక్‌లో వీడియో : ఎనమిది మంది ఆరోగ్యం విషమం
x
Representational Image
Highlights

కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి.. చైనాలోని వ్యుహన్ నగరంలో మొదలైన ఈ వ్యాధి దాదాపు 200 దేశాలకి పైగా వ్యాపించి చాలా మందిని బలితీసుకుంది.

కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి.. చైనాలోని వ్యుహన్ నగరంలో మొదలైన ఈ వ్యాధి దాదాపు 200 దేశాలకి పైగా వ్యాపించి చాలా మందిని బలితీసుకుంది. అయితే ఈ వ్యాధికి ఎలాంటి వ్యాక్సిన్ లేదు.. వ్యాక్సిన్ ని కనిపెట్టేందుకు ప్రపంచంలోని చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి మందు లేదు కాబట్టి వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని, సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయినప్పటికీ కొందరు మాత్రం కరోనా ఇలా చేయడం వలన అరికట్టవచ్చునని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఉమ్మెత్త పువ్వు గింజల ద్రామణం తాగితే కరోనా రాదంటూ కొంతమంది ఆకతాయిలు చేసిన టిక్‌టాక్ వీడియో ప్రస్తుతం 8 మందిని ఆసుపత్రి పాలు చేసింది. చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లిలోని ఆలపల్లిలో రెండు కుటుంబాలు పొరపాటు పడ్డాయి.

అందులో భాగంగా ఆ గింజలను తెచ్చి ద్రావణం తయారు చేసి రెండు కుటుంబాలు తాగారు.. ఆ తర్వాత అస్వస్థకి గురి కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ టిక్‌టిక్ వీడియా ఎవరు పెట్టారో ఆరా తీస్తున్నారు. ఇలా చేసిన వారిపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని జనాలు కూడా కోరుతున్నారు.

ఇక ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. ఆరుగురు డిశ్చార్జ్ అయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories