ముఖ్యమంత్రి యువనేస్తానికి ఎన్నికల కమీషన్ బ్రేకులు

ముఖ్యమంత్రి యువనేస్తానికి ఎన్నికల కమీషన్ బ్రేకులు
x
Highlights

ఏపీలో అమలవుతున్న ముఖ్యమంత్రి యువనేస్తం పెంపునకు ఎన్నికల కమీషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉన్నందున 7 జిల్లాల్లో యువనేస్తం సాయం...

ఏపీలో అమలవుతున్న ముఖ్యమంత్రి యువనేస్తం పెంపునకు ఎన్నికల కమీషన్ బ్రేకులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కోడ్‌ ఉన్నందున 7 జిల్లాల్లో యువనేస్తం సాయం ఏపీ ప్రభుత్వం పెంచలేదు. ఆరు జిల్లాల్లో మాత్రమే యువనేస్తం సాయం పంపిణీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యినందున 7 జిల్లాల్లో యువనేస్తం సాయం ఇచ్చేందుకు అంగీకరించాలని ఈసీని కోరింది. అయితే ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది ఎన్నికల సంఘం.

అయితే ఇదే క్రమంలో మరో నాలుగు ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. కాగా నిరుద్యోగులకు అపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ముఖ్యమంత్రి యువనేస్తం. ఈ పధకంలో భాగంగా మొదట రూ.1000 ఇస్తున్న ప్రభుత్వం.. ఇటీవల ఈ భృతిని 2వేలకు పెంచింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే భృతి పెంపునకు ఎన్నికల కమీషన్ ఆమోదం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories